హైదరాబాద్: ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ సెక్రటరీగా పూనం మాల కొండయ్య, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా రఫత్ అలీ, పంచాయతీ రాజ్ కమిషనర్‌గా సునీల్ శర్మ, సెంట్రల్ పవర్ కార్పోరేషన్ సీఎండీగా అనంత రాములు, వ్యవసాయ, సహాకార శాఖ ఎండీగా కాడ్మియల్, కమిషనర్ ఆఫ్ ఎంకై్వరిగా లింగరాజు పాణిగ్రహిలు నియమితులయ్యారు.