రేణుకా రెచ్చిపోకు : పొన్నం
హైదరాబాద్: తెలంగాణపై వివాదాస్పాద వ్యాఖ్యలు చేసి రెచ్చిపోవద్దని కేంద్ర మాజీమంత్రి రేణకాచౌదరికి ఎంపీ పొన్నంప్రభాకర్ హితవు పలికారు. డిసెంబర్ 10న సీమాంధ్ర నేతలు చేసిన బ్లాక్ మెయిల్ రాజీనామాలపై పెదవి విప్పని మాజీమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని తెలిపారు. 1972 లో జైఆంధ్ర అన్న ఆంధ్రప్రాంత నాయకులు ఇప్పుడు సమైక్యాంధ్ర అని ఎందుకంటున్నారో వివరించాలన్నారు. ఆకలిమంటకే తెలంగాణ నేతలు రాజీనామా చేశారన్న సంగతి రేణుక గుర్తించుకోవాలని హెచ్చరించారు.