It pays to remember, search engines ruining our memory : ఇంటర్నెట్‌ వాడకంతో మతిమరుపు

It pays to remember, search engines ruining our memory : ఇంటర్నెట్‌ వాడకంతో మతిమరుపు



న్యూయార్క్, జూలై 15: మీరు ఇంటర్నెట్‌ను విపరీతంగా వినియోగిస్తున్నారా? మిత్రులతో చాటింగ్ చేస్తూ గంటలకొద్దీ నెట్‌తో గడుపుతున్నారా? అయితే మీ జ్ఞాపకశక్తి క్షీణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎక్కువగా ఇంట్నట్‌ను వాడే ప్రజలు కొన్ని విషయాలను మరచిపోతున్నారని కొలంబియా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బెట్సి స్పారో తెలిపారు. ‘గూగుల్’ లాంటి వెబ్‌సైట్లలో దొరుకుతున్న సమాచారంతో ప్రజలు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడంలేదని ఆమె చెప్పారు. ఏ విషయమైనా ఇంట్నట్‌లో దొరుకుతుందనే భావనతో ప్రజలు ముఖ్య విషయాలను సైతం మరచి పోతున్నారని స్పారో వెల్లడించారు. ఈ విషయాన్ని నిర్ధారించడం కోసం స్పారో తన అనుచరులు ఎం. వెగ్నర్, జెన్నీ ల్యూతో కలిసి ఇంట్నట్ ఎక్కువగా వాడే కొంత మంది విద్యార్థులపై జ్ఞాపకశక్తికి సంబంధించిన నాలుగు రకాల పరీక్షలను నిర్వహించారు.

మొదటి పరీక్షలో అప్రధానమైన చిన్న ప్రశ్నలను విద్యార్థులను అడిగామని, వారు సమాధానాల కోసం ఇంట్నట్‌ను ఆశ్రయించారని పరిశోధకులు పేర్కొన్నారు. వారు ఆ సమాధానాలు చెప్పగలిగినప్పటికీ ఇంట్నట్‌పై ఆధారపడుతున్నారని, దీంతో వారు ఏదీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయడంలేదని స్పారో చెప్పారు. మరో పరీక్షలో 40 వాక్యాలను వారితో కంప్యూటర్‌లో టైప్ చేయించి, సేవ్ చేయించారు. ఆ తర్వాత టైప్ చేసిన అంశాల గురించి వారిని పరీక్షించగా అంతా మరచిపోయారని, వారు టైప్ చేసిన అంశాలు వారే గుర్తించలేక పోయారని శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో ఇంట్నట్ వాడటం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.



COLUMBIA: The widespread use of search engines and online databases has affected the way people remember information, researchers are reporting .

The scientists, led by Betsy Sparrow, an assistant professor of psychology at Columbia, wondered whether people were more likely to remember information that could be easily retrieved from a computer, just as students are more likely to recall facts they believe will be on a test.

Dr Sparrow and her collaborators, Daniel M Wegner of Harvard and Jenny Liu of the University of Wisconsin, Madison, staged four different memory experiments. In one, participants typed 40 bits of trivia — for example, "an ostrich's eye is bigger than its brain" — into a computer . Half of the subjects believed the information would be saved in the computer; the other half believed the items they typed would be erased.

The subjects were significantly more likely to remember information if they thought they would not be able to find it later. "Participants did not make the effort to remember when they thought they could later look up the trivia statement they had read," the authors write.

A second experiment was aimed at determining whether computer accessibility affects precisely what we remember. "If asked the question whether there are any countries with only one color in their flag, for example," the researchers wrote, "do we think about flags — or immediately think to go online to find out?"

In this case, participants were asked to remember both the trivia statement itself and which of five computer folders it was saved in. The researchers were surprised to find that people seemed better able to recall the folder.

The experiment explores an aspect of what is known as transactive memory — the notion that we rely on our family, friends and co-workers as well as reference material to store information for us. "I love watching baseball," Dr. Sparrow said. "But I know my husband knows baseball facts, so when I want to know something I ask him, and I don't bother to remember it."