తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధుల రాజీనామాలు!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధుల రాజీనామాలకు తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఈనెల 25న డెడ్‌లైన్ విధించింది. టీఎన్‌జీవోస్ భవనంలో గురువారం సమావేశమైన జేఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈనెల 25లోపు తెలంగాణపై తేల్చకుంటే ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని స్పష్టం చేసింది. అలాగే హైదరాబాద్‌లో రోడ్లపై వంటావార్పు, రహదారుల దిగ్బంధంతో పాటు మరోసారి రైలురోకో చేయాలని నిర్ణయించింది.