ఆలూరులో ప్రేమజంట ఆత్మహత్య

ఆలూరులో ప్రేమజంట ఆత్మహత్య


గుంటూరు : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరులో ఓ ప్రేమజంట ఆత్మహత్య పాల్పడింది. ఆలూరుకు చెందిన మంచాల అంకిరెడ్డి అదే గ్రామానికి చెందిన ఓలేటి లక్ష్మీ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావటంతో పెద్దలు వారి వివాహానికి అంగీకరించలేదు. దాంతో మనస్తాపం చెందిన వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.వారి మృతదేహాలను గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.