సాంబశివుని హత్యకేసులో మరోముగ్గురి అరెస్ట్

సాంబశివుని హత్యకేసులో మరోముగ్గురి అరెస్ట్

 నల్గొండ: మాజీ మావోయిస్టు నేత, టిఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివుడి హత్య కేసులో నయీం అనుచరులు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాంబశివుడిని ఇటీవల దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

నిందితులు వాడిన మరో కారుని కూడా వనస్థలిపురంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అరెస్టు చేసిన నిందితులను వలిగొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.