బీసీలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పార్టీ అధ్యక్ష పీఠాన్ని వారికే కట్టబెట్టాలనుకుంటున్నారా?
హైదరాబాద్, మేజర్ న్యూస్: మూడు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీ విజయాలలో కీలకపాత్ర పోషిస్తూ, అపజయాలు ఎదురైనా దూరం కాకుండా అంటిపెట్టుకుని వస్తున్న బీసీ వర్గాల పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారన్న అపప్రథను తొలగించుకునేందుకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించారా? బీసీలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పార్టీ అధ్యక్ష పీఠాన్ని వారికే కట్టబెట్టాలనుకుంటున్నారా? అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు ప్రత్యేక కారణాల రీత్యా పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీసీలకు అప్పగించాలని చంద్ర బాబు భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. బీసీలను పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టేందుకు చంద్రబాబు పన్నుతున్న వ్యూహం రెండు అంచులకూ పదను ఉంది. ముందు గత కొద్ది రోజులుగా పార్టీలో మొదలైన సంక్షోభాన్ని ఏదో ఒక దశలో ముంగిచాలన్న ఆలోచనతో ఆయన ఉన్న ట్టు చెబుతున్నారు.
స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పట్ల ఆగ్రహం కలిగేలా ఆయన కుమార్తె, కేంద్ర మంత్రి పురం ధేశ్వరి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఇటు ప్రింట్, అటు ఎల క్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా వస్తున్న నేపథ్యం ఒకటైతే, జన లోక్‌పాల్ బిల్లును కేంద్ర ప్రభుత్వ ఆమోదం సాధించిన అన్నా హజారేను అభినందిస్తూ హరికృష్ణ విడుదల చేసిన లేఖ మరో నేపథ్యం... ఈ లేఖలోనే హరికృష్ణ చివరి పేరా గ్రాఫ్‌లో కుంట భూమి లేని వారు కోటీశ్వరులు ఎలా అయ్యారని ప్రశ్నించటం, తన తండ్రి ఎన్టీఆర్ స్ఫూర్తిగా అవినీతిపై సమరానికి త్వరలోనే జనంలోకి వస్తానని లేఖ ముగించటం వంటి పరిణామాలు సహజంగానే చంద్ర బాబును పూర్తి ఇరకాటంలో పడవేశాయి.
మరోవైపు తమను ఇబ్బంది పెట్టరాదని బాలకృష్ణ ఒకవైపు చెబుతుంటే జూని యర్ ఎన్టీఆర్ మాత్రం హరికృష్ణకు వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడారు. ఈ వివాదంలో ఏదైనా తన తండ్రిగారే చెబు తారంటూ ముక్తాయింపు ఇచ్చారు. ఇంకోవైపు ఎన్టీఆర్‌కు వీర విధేయులైన, హరికృష్ణకు అత్యంత సన్నిహితులైన వల్లభనేని వంశీ వంటి వారు హరికృష్ణ లేఖను బాహాటంగా సమర్థించారు. ఇవన్నీ ఎటొ చ్చి ఎటు తలకు చుట్టుకుంటాయన్న ఆందోళన చంద్రబాబుకు కలుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే ఇంటిపోరును పూర్తిగా తగ్గించేందుకు ఆయన బీసీ కార్డును ముందుకు తీసుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బీసీని పార్టీ అధ్యక్షుడిగా చేస్తే ఇక ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎలాంటి భయం ఉండదన్న భావనతో చంద్రబాబు ఉన్నట్టు చెబుతున్నారు.
జగన్‌ను అడ్డుకునే ప్రయత్నం
మరోవైపు రాష్ట్ర రాజకీయాలలోకి దూసుకు వచ్చిన వైఎస్ జగన్‌ను నియంత్రించాలంటే తెలుగుదేశం పార్టీకి బీసీ నేతను అధ్యక్షుడిగా చేయటం ఒక్కటే మార్గం అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. బీసీని అధ్యక్షుడుగా చేసి తాను తెరవెనుక ఉండి జగన్ అవినీతిపై పార్టీ ద్వారా పోరాటం చేయించేందుకు తద్వారా రాజకీయంగా మరింత లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఇలా బీసీ అస్త్రాన్ని ముందుకు తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.
రాష్ట్రం విడిపోయినా
ప్రస్తుతం ప్రత్యేక, సమైక్య వాదాలు ఉధృతంగా సాగుతున్న తరుణంలో ఒకవేళ రాష్ట్రం విడిపోయినా, బీసీలను రెండు చోట్ల అధ్యక్షులుగా చేయటం వల్ల నష్టం లేదని చంద్రబాబు నమ్ముతున్నారంటున్నారు. ఆయన ఆలోచనలకు తగినట్టుగానే ఉభయ ప్రాంతాలలో అధ్యక్ష బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలిగిన పలువురు నాయకులు ఉన్నారు. ఎవరికి బాధ్యత అప్పగించినా రెండు ప్రాంతాలలో బీసీలను పార్టీ వైపు ఆకర్షించవచ్చునని, 2014 నాటికి ఈ ప్రయత్నాలన్నీ ముగిస్తే కాంగ్రెస్, జగన్ పార్టీలను సమర్థంగా ఎదుర్కోవచ్చునని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.
చంద్రబాబు కన్న సీనియర్లూ ఉన్నారు
వాస్తవానికి పార్టీలో చంద్రబాబు కన్న సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. ఆవిర్భావ కాలం నుంచి పార్టీ కోసం అంకిత భావంతో పని చేస్తున్న బీసీ నేతలంతా ఆ తర్వాత ఎప్పటికో పార్టీలోకి వచ్చిన చంద్రబాబు ఛత్రఛాయలో ఉంటూ వస్తున్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు క్రమంగా పార్టీకి దూరం అవుతున్న ప్రస్తుత తరుణంలో వారందరినీ మళ్ళీ ఆకర్షించేందుకు ఇంతకన్న మంచి అవకాశం లేదని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిసింది.
‘చంద్రబాబు ఆలోచనా ధోరణి ఏమిటో చెప్పలేము కానీ, ఇదే నిజమైతే మాత్రం పార్టీకి మంచి రోజులు వచ్చినట్టే....ఆవిర్భావ కాలం నుంచి, ఎన్టీఆర్‌పైన, ఆయన పాలనా దక్షత పైన విశ్వాసం ఉంచిన మేమంతా అలాగే కొనసాగుతూనే వస్తున్నాం....పార్టీ ఏర్పడి మూడు దశాబ్దాలు గడచినా సగానికి పైగా జనాభా ఉన్న మాకు అవకాశం రాలేదన్న అసంతృప్తి, ఆవేదన ఎప్పటినుంచో చెందుతున్నాం....అధికారంలో ఉన్నంతకాలం కనీసం బీసీని ఉప ముఖ్యమంత్రిగా చేయలేకపోయారు.కాంగ్రెస్ పార్టీ అయినా ఒకసారి సి.జగన్నాథరావును ఉప ముఖ్యమంత్రిని చేసింది. అధ్యక్షుడి ఆలోచనలో మార్పు నిజమే అయితే అది నిజంగా పార్టీకి శుభ పరిణామం. పార్టీని పునరుజ్జీవింప జేసేందుకు ఒక చక్కటి తొలి అడుగు పడినట్టు లెక్క...’ అని కొందరు నేతలు మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.