నష్టాల్లో యూఎస్, యూరప్ మార్కెట్లు
న్యూయార్క్: నిరాశజనకమైన ఆర్ధిక ఫలితాలు, జపాన్ న్యూక్లియర్ సంక్షోభ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలలో డోజోన్స్ 133 పాయింట్లు, నాస్‌డాక్ 30 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. యూరప్ మార్కెట్లలో ఎఫ్‌టీఎస్‌ఈ 89 పాయింట్లు, డాక్స్ 101, కాక్ 69 పాయింట్లు పతనమయ్యాయి.