బైక్ ఢీకొట్టిన వైఎస్ వివేకా అల్లుడి కారు
కడప: మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు ప్రయాణిస్తున్న స్కార్పియో ఎదురుగా వస్తున్న మోటార్‌బైక్‌ను ఢీకొంది. తొండూరు మండలం సైదులపేట సమీపంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. వివేకా అల్లుడు నర్రా రాజశేఖరరెడ్డి గాయపడ్డారు. ఆయనను పులివెందుల ఆస్పత్రికి తరలించారు.