ప్రజా సమస్యలు పట్టని సర్కార్,,,,
ప్రజా సమస్యలు పట్టని సర్కార్,,,,,,,,,

హైదరాబాద్, మేజర్‌న్యూస్ : రాష్ట్రంలో రెండో దఫా కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ.. రాష్ర్ట ప్రజల సమస్యలు, వారి గోడు వినే నాధుడే కరువయ్యాడు. గత రెండేళ్లుగా రాష్ట్ర బడ్జెట్‌ను లక్ష కోట్లకు పైగా బడ్జెట్ పథకాలను అంకెలతో ఆకర్షనీయంగా ప్రకటి స్తున్నప్పటికీ.. అందులో ఏఒక్క పథకం కూడా పూర్తి స్థా యి లక్ష్యాలు సాధించలేదు. ఇందుకు ఆయా శాఖల పనితీరు, గణాకాలు స్పష్టంచేస్తున్నాయి. కాగా, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం, తాగు నీరు, పింఛన్లు, రేషన్ కార్డులతోపాటు.. ఇతర మౌలిక పరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు.
తాజాగా రాష్ట్రంలో నెలకున్న పరిస్థితులపై ఆర్థిక వేత్తలు కూడా నిరాశతో పెదవి విరుస్తున్నారు. ఒకవైపు ఉత్పాదక రహిత వృద్ధితో కూడిన రెవిన్యూ వ్యయం బడ్జెట్ అంచనాలకు మించి పెరిగిపోయింది. దీంతో ఆమేరకు క్యాపిటల్ వ్యయం పూర్తిగా నీరుగారుతోన్నదని ఆర్ధికరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా గత మూడు వార్షిక బడ్జెట్‌లను పరిశీలిస్తే.. రాష్ట్రం తిరోగమ నంలో నడుస్తోన్నాయని పరిశీలకులు సైతం గగ్గోలెడుతు న్నారు. గత ఆర్ధిక సంవత్సరం(2010-11) అర్థిక గణాం క శాఖ ముందస్తు అంచనా మేరకు రాష్ట్ర జిఎస్‌డిపి 8.6 శాతంగా పేర్కొంటున్నప్పటికీ.. ఆర్థిక వేత్తలు మాత్రం ఈ అంచనాలను కోట్టిపారేయడం విశేషం.
సీఎంకు ఎన్నికల ఫీవర్...!
ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత రాష్ర్టంలో రాజకీయ అనిశ్చితి నీడలా వెంటాడుతూనే ఉంది. వైఎస్ మృతి అనంతరం కొణిజేటి రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటికీ... పరిస్థితి ఏమాత్రం చక్కబడలేదు. దీనికి తోడు ఒక వైపు ప్రాంతీయ ఉద్యమాలు.. మరోవైపు రాజకీయ అనిశ్చితి కొనసాగు తునే ఉంది. ఇలాంటి పరిస్థితులు రాష్ర్ట ప్రజానీకాన్ని ఉక్కి రిబిక్కిరి చేస్తూ.. రాష్ట్రాన్ని మరింత ఉద్రిక్తత పరిస్థితుల్లోకి నెట్టాయి.
దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు, వరదలు రాష్ర్ట ప్రజలపై ముప్పేట దాడిచేసి..తమ ప్రతాపాన్ని చూపాయి. రోశయ్య తర్వాత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ... రాష్ట్రంలో ఆశాజనకమైన పరిస్థితులు నెలకొనలేదు. వరుస ఎన్నికలు ఆయనను తరుముతూనే ఉన్నాయి. గత వారం రోజుల కిత్రం వరకు అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై కిరణ్ సర్కార్ రాజకీయపరంగా ఎత్తుకు పైఎత్తులు వేసి పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడంలో కృతార్థులయ్యా రు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అధికారపార్టీకి సంతృప్తిని కలిగించలేకపోయాయి.
తాజాగా కడప జిల్లాలో జరుగుతున్న పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్, కడప లోక్‌సభ ఉప ఎన్నికలపైనే అధికా రపార్టీ, ప్రభుత్వం దృష్టిసారించాయి. వీటిల్లో ఏమాత్రం పరిస్థితులు చేయిదాటినా.. కిరణ్ ముఖ్య మంత్రి పీఠానికే ముప్పు కలిగే అవకాశాలున్నట్లు సొంత పార్టీ వర్గాల్లో ప్రచారం ఇప్పటికే మొదలైంది. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి సచివాలయం వైపే చూడలేదంటే కడప ఉప ఎన్నికల్లో తమ ప్రత్యర్థులను ఓడించడానికి ఏమేరకు ఆయన కసరత్తు చేస్తోన్నరో ఇట్టే అర్థమవుతోన్నది.
వరుస సెలవులతో మరింత బేజారు...
ఈ నెల వరుస సెలవులతో రాష్ట్ర ప్రజల పరిస్థితి మరిం త చేయిదాటింది. ఇప్పటికే తొలి వారం దాదాపుగా సెలవు లతో ముగిసింది. ఈనెల మరో ఎనిమిది రోజులు ఆదివా రాలతో కలుపుకుంటే..ఈ సంఖ్య మరింత పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు మండుతున్న ఎండలతో రాష్ట్ర ప్రజలు సరైన తాగునీరు అందక దాహం దాహం అంటూ సర్కార్ వైపు చూస్తు న్నారు. మరొవైపు విద్యుత్ కోతలలో పెల్లెలు, పట్టణాల ప్రజానీకం అసహనానికి గురవుతున్నారు. పరిశ్రమలకు రెండు రోజు ల కరెంటు కోతలు అనివార్యంగా మారాయి. కరెటు కోతల వల్ల పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతోం దని పరిశ్రమల సమాఖ్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అర్ధాకలితో అలమటిస్తున్న బడుగులు
విద్యా సంవత్సరం ముగుస్తోన్నా.. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందని పరిస్థితి నెలకొంది. హాస్టళ్లల్లో సరైన వసతి సౌకర్యాలు లేక బడుగు విద్యార్థుల గోడు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. మెస్ బిల్లు లను సర్కార్ సకాలంలో చెల్లించకపోవడంతో నాణ్యతా ప్ర మాణాలు లేని అరకొర ఆహారంతోనే యజమాన్యాలు సరి పెడుతున్నాయి. మొత్తంగా చూస్తుంటే.. పేద విద్యార్థు లు అర్థ ఆకలితో చావండన్నట్లు కిరణ్ ప్రభుత్వం వ్యవహా రిస్తో న్నట్లు బీసీ సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
అదే విధంగా ప్రభుత్వ విధానపరమైన పలు శాఖలకు సంబందించిన కీలకమైన ఫైళ్ల క్లియరెన్స్‌పైనా సీఎమ్‌ఓ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ శాఖల నుంచి సీఎమ్‌ఓకు ఫైళ్లు వెల్లడం తప్ప.. క్లియరెన్స్ అయ్యి తిరిగి రావడం లేదని, కొన్ని సందర్భాల్లో సీఎం క్లియర్ చేసినప్పటికీ, సీఎం కార్యాలయ అధికారులు మ రింత అత్యుత్సాహం చూపిస్తోన్నట్లు పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులే మండిపడుతున్నారు.సీఎం కార్యాలయ అధికా రులతీరుపై క్యాబినెట్‌లోని సీనియర్ మంత్రులుసైతం మీడియా ముందే తమ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.