బాలకృష్ణ పత్రికా ప్రకటనపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర అసంతృప్తి..నందమూరి వంశాన్ని విభజించు పాలించు రీతిలో వ్యవహరిస్తున్నారంటు సన్నిహితుల వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన
బాలకృష్ణ పత్రికా ప్రకటనపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర అసంతృప్తి..నందమూరి వంశాన్ని విభజించు పాలించు రీతిలో వ్యవహరిస్తున్నారంటు సన్నిహితుల వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన
తెలుగుదేశం పార్టీ చిక్కుల్లో ఇరుక్కొని క్లిష్టపరిస్థితుల్లో ఉంది. నందమూరి, నారా వారి కుటుంబాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యయి. ఈ వివాదంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పేర్లతోపాటు ఇప్పుడు నారా లోకేష్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. హరి కృష్ణ లేఖ పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
బాలకృష్ణ పత్రికా ప్రకటనపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. చంద్రబాబు వైఖరిపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ ప్రచారానికి వాడుకొని, ఇప్పుడు నందమూరి వంశాన్ని విభజించు పాలించు రీతిలో వ్యవహరిస్తున్నారని ఆయన తన సన్నిహితుల వద్ద బాధపడినట్లు తెలిసింది.
ఎన్నికలప్పుడు మనం, మన వంశం అన్న బాబాయ్ బాలకృష్ణ నిన్నటి పత్రికా ప్రకటనలో ఈ వివాదాల్లోకి తనను లాగవద్దని పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. హరికృష్ణ, వంశీ, నాని చేసిన తప్పేంటని జూనియర్ ఎన్టీఆర్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. అసలు వివాదానికి కారణమైన చంద్రబాబు వర్గీయులను ఏమీ అనకపోవడం ఏమిటన్నది ఆయన ప్రశ్న.
చంద్రబాబు ఫోన్'కు స్పందించలేదన్న విషయాన్ని మీడియాకు లీక్ చేయడంపై నారా లోకేష్ ని జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది