బికినీ వేస్తా... పెదవులపై ముద్దిస్తా: స్నేహ
బికినీ భామల తాకిడికి దక్షిణాది తారలు కుదేలవుతున్నారు. అవకాశాలు రాక గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూచుంటున్నారు. తిరిగే కాలు.. అరిచే నోరు ఆగదన్నట్లు సినిమాల్లో నటించే తారలు ఖాళీగా ఉండాలంటే కష్టమే మరి. అందుకనే ఏమోగానీ స్నేహ దేనికైనా సిద్ధమేనని ప్రకటించిందట.
లిప్ టు లిప్ కిస్, పొదుపైన బికినీలో కనబడేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని సందేశాలను పంపిస్తోందట. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య నిర్మిస్తున్న గోవా చిత్రంలో స్నేహ తన అందాలన్నిటినీ ఆరబోసిందట. ఇంకా చూపించమన్నా చూపించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని దర్శకునికి చెపుతోందట.
స్నేహ ఉత్సాహాన్ని చూసి గ్లామర్ సన్నివేశాల్లో ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేయించాడట చిత్ర దర్శకుడు. సినిమా వస్తే కానీ తెలియదు... స్నేహ ఏం రేంజ్‌లో చూపించిందో...?!!