"ఊసరవెల్లి"గా రానున్న జూనియర్ ఎన్టీఆర్
"ఊసరవెల్లి".. ఈ మాటను మనం ఎక్కువగా రాజకీయ నాయకుల నోట నుంచి వింటుంటాం. ఇపుడు ఇదే పేరును సినిమాకు పెట్టుకుని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు. శ్రీ వేంకటేశ్వర సినీచిత్ర బ్యానర్‌పై సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ విభిన్నమైన పాత్ర పోషిస్తున్నట్లు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌ను చిత్ర నిర్మాత గురువారంనాడు విడుదల చేశారు.
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సమకాలీన రాజకీయాలలో చోటుచేసుకుంటున్న పరిస్థితులు, ఊసరవెల్లి రాజకీయాలు వగైరా.. వగైరా.. ఉండొచ్చన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.