పంజాబ్ హ్యాట్రిక్ విజయం

పంజాబ్ హ్యాట్రిక్ విజయం


వరుస విజయాలు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుతాయో చూపిస్తూ పంజాబ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. బ్యాట్స్‌మెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో దుమ్మురేపితే, బౌలర్లు క్రమశిక్షణతో రాణించారు. వెరసి ఐపీఎల్-4లో పంజాబ్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది.

మొహాలీ: షాన్ మార్ష్ మెరుపు అర్ధసెంచరీకి తోడుగా జట్టు మొత్తం ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబరచడంతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మరో భారీ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో గెలిచి సీజన్‌లో మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. పీసీఏ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు గిల్‌క్రిస్ట్ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్సర్), వాల్తాటి (31 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరూ కేవలం 4.2 ఓవర్లలోనే 67 పరుగులు జోడించారు. తొలి రెండు ఓవర్లలో ఈ ఇద్దరూ అవుటైనా... రెండూ నోబాల్స్ కావడంతో బతికిపోయారు. షాన్ మార్ష్ (42 బంతుల్లో 71; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి అర్ధసెంచరీ సాధించాడు. దినేశ్ కార్తీక్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు) రాణించాడు. ఒక దశలో పంజాబ్ 200 మార్కును చేరడం ఖాయమనిపించినా, ఆఖరి దశలో వేగంగా వికెట్లు పడటంతో 195తో సరిపెట్టుకుంది. రాజస్థాన్ బౌలర్ టెయిట్ మూడు వికెట్లు తీసుకోగా, వాట్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

రాజస్థాన్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. వార్న్ సేన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసి ఓడింది. షేన్ వాట్సన్ (16 బంతుల్లో 24; 4 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ (24 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్సర్), మెనేరియా (26 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్సర్), రౌత్ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కానీ ఏ ఒక్కరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఆరంభం నుంచి పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి భారీ విజయాన్ని అందించారు. ప్రవీణ్ కుమార్, భార్గవ్ భట్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇదే అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు (20 బంతుల్లో) చేసిన జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది. పంజాబ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలవగా, రాజస్థాన్‌కు ఆరు మ్యాచ్‌ల్లో ఇది మూడో ఓటమి.


Kings XI Punjab innings (20 overs maximum) R B 4s 6s SR
View dismissal AC Gilchrist*† c Tait b Watson 28 16 4 1 175.00
View dismissal PC Valthaty c Tait b Warne 46 31 4 3 148.38
View dismissal SE Marsh c & b Watson 71 42 6 3 169.04
View dismissal KD Karthik c †Yagnik b Tait 21 16 3 0 131.25
View dismissal AM Nayar run out (Binny/Watson) 1 3 0 0 33.33
View dismissal R McLaren c Raut b Tait 2 7 0 0 28.57

Sunny Singh not out 5 5 1 0 100.00
View dismissal PP Chawla b Tait 4 3 1 0 133.33

Extras (b 1, lb 6, w 7, nb 3) 17











Total (7 wickets; 20 overs) 195 (9.75 runs per over)
Did not bat RJ Harris, P Kumar, BA Bhatt
Fall of wickets1-67 (Gilchrist, 4.2 ov), 2-105 (Valthaty, 9.4 ov), 3-175 (Karthik, 15.6 ov), 4-178 (Nayar, 16.5 ov), 5-183 (Marsh, 18.1 ov), 6-190 (McLaren, 19.1 ov), 7-195 (Chawla, 19.6 ov)










Bowling O M R W Econ


SK Trivedi 4 0 59 0 14.75 (2nb, 2w)
View wickets SW Tait 4 1 22 3 5.50 (1nb, 2w)
View wicket SK Warne 4 0 50 1 12.50

View wickets SR Watson 4 0 24 2 6.00


STR Binny 2 0 18 0 9.00 (1w)

AL Menaria 1 0 7 0 7.00


AS Raut 1 0 8 0 8.00










Rajasthan Royals innings (target: 196 runs from 20 overs) R B 4s 6s SR
View dismissal SA Asnodkar b Kumar 9 9 1 0 100.00
View dismissal R Dravid b Harris 8 7 2 0 114.28
View dismissal SR Watson c Chawla b Kumar 24 16 4 0 150.00
View dismissal STR Binny c Chawla b McLaren 30 24 2 1 125.00
View dismissal LRPL Taylor lbw b Chawla 0 5 0 0 0.00
View dismissal AL Menaria c Marsh b Bhatt 34 26 2 1 130.76
View dismissal AS Raut c Harris b Bhatt 25 21 3 0 119.04

DH Yagnik not out 10 9 1 0 111.11

SK Warne* not out 5 3 1 0 166.66

Extras (lb 1, w 1) 2











Total (7 wickets; 20 overs) 147 (7.35 runs per over)
Did not bat SW Tait, SK Trivedi
Fall of wickets1-12 (Dravid, 1.6 ov), 2-18 (Asnodkar, 2.6 ov), 3-47 (Watson, 6.3 ov), 4-49 (Taylor, 7.6 ov), 5-99 (Binny, 12.6 ov), 6-124 (Menaria, 17.1 ov), 7-140 (Raut, 19.1 ov)










Bowling O M R W Econ

View wickets P Kumar 4 0 22 2 5.50

View wicket RJ Harris 4 0 34 1 8.50 (1w)
View wickets BA Bhatt 3 0 20 2 6.66

View wicket PP Chawla 4 0 24 1 6.00


PC Valthaty 2 0 19 0 9.50

View wicket R McLaren 2 0 24 1 12.00


AM Nayar 1 0 3 0 3.00

Match details
Toss Rajasthan Royals, who chose to field
Points Kings XI Punjab 2, Rajasthan Royals 0
Player of the match SE Marsh (Kings XI Punjab)
Umpires S Asnani and PR Reiffel (Australia)
TV umpire RJ Tucker (Australia)
Match referee J Srinath
Reserve umpire K Bharatan