"ప్రిన్స్" మహేష్‌బాబుకు "ఖలేజా" అనుష్క సిస్టర్‌!

"ప్రిన్స్" మహేష్‌బాబుకు "ఖలేజా" అనుష్క సిస్టర్‌!




ఇటీవలి కాలంలో హీరోలతో జోడీగా నటించిన హీరోయిన్లు తమకు చెల్లెళ్లని మంచు విష్ణు, అల్లరి నరేశ్‌ చెప్పిన విషయం తెలిసిందే. కానీ మహేష్ బాబు విషయంలో అలా లేదు. ఆయన చెప్పకుండానే హీరోయిన్లు మహేష్‌కు చెల్లెళ్లయిపోతున్నారు.

'ఖలేజా' చిత్రంలో మహేష్ సరసన అనుష్క నటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో మహేష్‌కు అనుష్క అక్కలా ఉందనే కామెంట్స్‌ వినిపించాయి. గతంలో హీరోయిన్‌గా చేసినవారు మరో సినిమాలో చెల్లెలుగా, అక్కగా నటించిన సందర్భాలున్నాయి. అదే పరిస్థితి మహేష్‌బాబుకు వచ్చింది.

మణిరత్నం దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'వీరుడు'. ఈ చారిత్రాత్మక చిత్రంలో తమిళ నటుడు విజయ్‌ కూడా నటిస్తున్నాడు. ట్విస్ట్‌ ఏమంటే.. విజయ్‌ సరసన అనుష్క నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్‌కు వరుసకు చెల్లెలుగా నటిస్తోందట అనుష్క. మొత్తానికి "ఖలేజా" అనుష్క చెల్లెలుగా మారడం విచిత్రమే. తదుపరి సమాచారం కోసం వెయిట్‌ అండ్‌ సీ.