మా కుటుంబం విడిపోలేదు: చిరంజీవి
కడప: తమ కుటుంబం విడిపోలేదని, కలసికట్టుగానే ఉందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్సష్టం చేశారు. కుటుంబం విడిపోయిందన్న వార్తలపై జర్నలిస్టులపై ఆయన మండిపడ్డారు. జర్నలిజం ఎటుపోతుందో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరెంజ్ సినిమాకి నాగబాబు కాకుండా మరొకరు నిర్మాత అయి ఉంటే ఆత్మహత్య చేసుకొని ఉండేవారన్నారు.
పీఆర్పీ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి రేపు పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చిరంజీవి చెప్పారు.







