అభిజిత్‌లగ్నంలో సీతారాముల కల్యాణం

అభిజిత్‌లగ్నంలో సీతారాముల కల్యాణం
 భద్రాచలం అర్బన్‌ మేజర్‌న్యూస్‌: కల్యాణానికి ప్రతీతి శ్రీరామకల్యాణం. ప్రతీయేటా భద్రాచలంలో పరమాత్ము నికి అత్యంత ప్రీతివంతమైన మిట్టమద్యాహ్న సమయం 12 గంటలకు అభిజిత్‌లగ్నంలో సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఆలయ సంప్రదాయం. దీంట్లో బాగంగా ఏప్రియల్‌ 12 వ తేదీన మద్యాహ్నం 12 గంటలకు మిధిలాస్టేడియంలో గణపతిస్తపతి అనే ప్రపంచ ప్రఖ్యాత వాస్తుకళాశిల్పకారుడిచే నిర్మించబడిన కళ్యాణవేదికపై స్వామివారి కళ్యాణం నిర్వహించడానికి దేవస్థానం అధికా రులు ఏర్పాట్లు చేశారు. ఈ ముహూర్తం సర్వదోషాలను హరిస్తుందని పురాణ కదల్లో పేర్కొన్నారు.

గ్రామాలలో దీన్ని మోటుబాషలో గడ్డపార ముహూర్తంగా పిలుస్తారు. శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సీతా రాముల కళ్యాణ మహోత్సవం భద్రాచలంలో వైభవోపే తంగా భక్తులకు కన్నుల విందుచేయనుంది. శ్రీరాముడు పుట్టినరోజు, అదే జన్మ నక్షత్రంలో వివాహం చేయడం పం చరాత్ర ఆగమ సాంప్రదాయంగా వేదపండితులు పేర్కొ న్నారు. ఆతేదీ ఉదయం 10 గంటల 30 నిముషాల నుండి 12.30 గంటల వరకు జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా భక్తులు తిలకించే విదంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం గమనార్హం. శ్రీరామనవమిని ఆరోజున భద్రాచలంలో ఎవరు తిలకిస్తా రో వారికి అశ్వమేధయాగం చేసిన ఫలం దక్కుతుందని పురాణాలలో చెపుతున్నాయి.

ప్రసార మాధ్యమాలలో
శ్రీరామనవమి ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఆల్‌ఇండియారేడియో, దూరదర్శన్‌, సమా యత్తం అయినట్లు విశ్వసనీయవర్గాలద్వారా తెలిశాయి.

400 సంవత్సరాల చరిత్రగల నగలివే
దాదాపు 400 సంవత్సరాల క్రితం శ్రీరామ భక్తాగ్రే సరుడు తహసిల్దార్‌ రామదాసు(కంచర్లగోపన్న) చేయించి న పచ్చలపదకం, చింతాకుపదకం, మంగళ సూత్రాలు కలికితురాయి, ముత్యాలపదకముతోపాటు శ్రీరామునికి చేయించిన రామమాడ లతో ఈ కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.

శుభాకాంక్షలు
హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాష్ర్ట ప్రజలకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు.. పీసీసీ చీఫ్‌ డీ. శ్రీనివాస్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రజా రాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, దత్రాత్రేయలు కూడా సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని తమ శుభాకాంక్షలను తెలిపారు.