తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరపైకి వచ్చిన కొత్త రాజకీయ ఫ్రంట్ ప్రతిపాదన వెనుక కెసిఆర్ వ్యూహం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరపైకి వచ్చిన కొత్త రాజకీయ ఫ్రంట్ ప్రతిపాదన వెనుక కెసిఆర్ వ్యూహం 

 

 టీఆర్ఎస్  అధ్యక్షుడు కేసీఆర్ కు, తెలంగాణ జేఎసీ చైర్మన్ కోదండరాం, కొరకరాని కొయ్యగా మారారా..? కోదండరామ్ కు ఏదో ఒక రకంగా చెక్ పెట్టడానికి గులాబి దండు దళపతి వ్యూహాలు రచిస్తున్నారా..? తెలంగాణ రాజకీయ జేఏసీని నిర్వీర్యం చేసి కొత్త రాజకీయ వేదిక నిర్మాణానికి, పావులు కదుపుతున్నారా... వివిధ రాజకీయ పక్షాలతో కొత్త రాజకీయ ఫ్రంట్ కోదండరామ్ ప్రభావాన్ని తగ్గించాడానికేనా.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరపైకి వచ్చిన కొత్త రాజకీయ ఫ్రంట్ ప్రతిపాదన వెనుక కెసిఆర్ వ్యూహం ఉన్నట్టు కనపడుతోంది. ఈ ప్రతిపాదన కెసిఆర్ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
లోతుగా గమనిస్తే ఈ వ్యూహంలో తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా కనిపిస్తున్న కోదండరాం ప్రాబల్యానికి పరోక్షంగా అడ్డకట్ట వేయడమేననిపిస్తోంది. గత నెలలో జరిగిన మిలియన్ మార్చ్ నుండి టీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ కు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ మధ్య దురం పెరిగింది. మిలియన్ మార్చ్ టిఆర్ యస్ వల్ల కాక జేఏసీ ఇచ్చిన పిలుపుతో సక్సెస్ కావడమే ఇందుకు కారణం. జేఏసీ ప్రభావం తెలంగాణ ప్రజలపై పెరిగిపోయిందని గూలాబి నాయకత్వం బహిరంగంగానే అంగీకరిస్తోంది. 
ఈ నేపద్యంలో రాజకీయంగా టిఆర్ యస్  పలుకుబడి నిలబడాలంటే, జేఏసీ ప్రభావన్ని తగ్గించాలని కోదండరామ్ వేగానికి అడ్డుకట్ట వేయలని కుడా టిఆర్ఎస్ నాయకత్వం అంతర్గత సమావేశల్లో చర్చకు వచ్చినట్టు సమాచారం. తెలంగాణ జేఎసీ పగ్గాలను కోదండరామ్ నుండి తీసుకోవడం అంత ఈజీ కాదనేది కుడా ఆ పార్టీ ఆభిప్రాయం. బలమైన శక్తిగా తెరపైకి వస్తున్న కోదండరామ్ కు చెక్ పెట్టడానికి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే కొత్త రాజకీయ ఫ్రంట్ ప్రతిపాదన అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చి కోదండరామ్ ను కాదని కొత్త వ్యక్తికి ఆ ఫ్రంట్ కు సారథి బాధ్యతలను ఇవ్వాలనేది కేసీఆర్ తాజా ఆలోచనగా కనబడుతోంది. తెలంగాణ జర్నలిస్టుల నిరసన సభ కాస్త తెలంగాణ రాష్ట్రం కోసం కొత్త వేదిక ఆవిష్కార సభగా మారడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.శ్రీకృష్ణ కమిటి 8వ అధ్యాయం గురించి ఏర్పాటు చేసిన సభలో శ్రీకృష్ణ రహస్యాల గురించి మాట్లాడకుండా కొత్త రాజకీయ ఫ్రంట్ గురించి మాట్లాడడం ద్వారా ఇతర రాజకీయ పక్షాలకు చెందిన వారు ఈ వ్యూహాన్ని ఆహ్వానిస్తున్నట్టే. ఈ నిరసన సభలో మాట్లాడిన వక్తలంతా రాజకీయ పార్టీల నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమన్న విషయాన్ని గట్టిగా చెప్పారు. ఇప్పుడు నడుస్తున్న జేఏసీలన్నీ  రాజకీయ పార్టీల నాయకత్వంలోనే నడవాలన్న సారాంశాన్ని స్పురింపజేశారు. రాష్ట్ర సాధన జెఎసిల ద్వారా కాక రాజకీయ పార్టీల ద్వారా వస్తుందని చెప్పడం ద్వారా, తెలంగాణ కోసం పోరాడుతూనే, తమ రాజకీయ ప్రయోజనాలకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని నాయకుల వ్యూహం.
తెలంగాణ రాజకీయ జేఏసి ఏర్పాటుకు ముందు తెలంగాణ ఉద్యమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కేసీఆర్ ఉండేవారు. కాని తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పాత్ర పెరగడంతో కోదండరామ్ పేరు పైకి వచ్చింది. జేఏసీ సమావేశాల్లో కేసీఆర్ ను రాజకీయంగా విభేదించే వారికి పెద్దపీట వేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కోదండరామ్ కేసీఆర్ మధ్య ఆంతరం పెరిగిందని సమాచారం. 
ఏది ఎమైనా కోత్తగా చోటు చేసుకోంటున్నా పరిణమాలు పోటిలికల్ జేఎసీ ఆధిపత్యానికి చెక్ పెట్టేదిగా కనిపిస్తోంది.జెఎసి మరింత బతోపేతమైతే పరిస్ధితి చేయి దాటుతుందనే ఆందోళన టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలకు ఉంది.