శత చండీయాగం మూడో రోజు మహా పూర్ణాహుతి కార్యక్రమం
మొయినాబాద్: శత చండీయాగం మూడో రోజు మహా పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని పండితులు తెలిపారు. శత చండీయాగంలో ఇదే కీలక ఘట్టమని దాన్ని వీక్షించిన వారికి అన్ని రకాల శుభాలు కలుగుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు ఉదయమే ఇక్కడకు చేరుకుని రాత్రి వరకు ఉంటారన్నారు. తెలంగాణ రాష్ట్రం త్వరగా సిద్ధించాలనే సదుద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం కావటంతో టీఆర్‌ఎస్ శ్రేణులు శనివారం పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. వెయ్యి మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. శత చండీయాగానికి రెండు రోజులగా వాహనాలు ఎక్కువగా రాకపోవడంతో ట్రాఫిక్ సమస్య పెద్దగా ఏర్పడలేదు. కానీ శనివారం మాత్రం ఎక్కువ స్థాయిలో వాహనాలు వచ్చే అవకాశం ఉందని ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని పోలీసులు భావిస్తున్నారు.