విజయ పాల ధర రూపాయి పెంపు

విజయ పాల ధర రూపాయి పెంపు
ఉప్పల్: ‘విజయ’ బ్రాండ్ పాల ధర లీటరుకు ఒక్క రూపాయి పెరిగింది. శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటికే నెలకార్డులు కొన్న వారికి మే 10 వరకు పాత ధరకే పాలు సరఫరా చేయనున్నట్లు ఏపీ డెయిరీ ఎండీ హర్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఇప్పటికే ముద్రించిన ప్యాకెట్లు పూర్తయ్యే వరకు వాటిపై పాత ధరలే ఉంటాయన్నారు. పాల సేకరణ ధర, ఉత్పత్తి వ్యయం పెరగడంతో అమ్మకం ధరలను పెంచాల్సి వచ్చిందన్నారు. హోల్, స్టాండర్డ్ రకం పాల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. తాజా ధరల పెంపు తర్వాత కూడా జంటనగరాల్లో అతి తక్కువ ధర ఉన్నది విజయ పాలేనన్నారు.