అభిషేక్‌కు గిన్నిస్...:
తరచూ సినిమా అవార్డులు అందుకోవడం లేదా అందజేయడం వంటి అనుభవాలే ఎదుర్కొన్న బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ రొటీన్‌కు భిన్నంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు అవార్డును స్వీకరించారు. సినిమా ప్రచార కార్యక్రమాల కోసం ఒక రోజులో ఎక్కువ నగరాలు తిరిగిన నటుడిగా ఆయన గిన్నిస్ రికార్డు సృష్టించారు. గతంలో ఐ రోబో సినిమా ప్రచార ం కోసం హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ 24 గంటల్లో మూడు నగరాల్లోని కార్యక్రమాల్లో పాల్గొనగా, తాజాగా ఢిల్లీ6 చిత్రం కోసం ఏడు ప్రోగ్రాంలలో పాల్గొని అభిషేక్ ‘గిన్నిస్’లోకి ఎక్కారు.