దేశానికి పట్టిన కేన్సర్ కాంగ్రెస్: చంద్రబాబు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన కేన్సర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆ పార్టీ పోతేగానీ దేశం బాగుపడదని అన్నారు. దేశానికి ప్రధానమైన సమస్య కాంగ్రేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి, అవినీతికి అవినాభావ సంబంధముందని శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ అవినీతి జరిగిందని చంద్రబాబు తెలిపారు. కామన్వెల్త్, 2జీ స్పెక్ట్రం కుంభకోణాలు ఆ పార్టీ పాలనలోనే జరిగాయన్నారు. అవినీతిని నిర్మూలనకు హస్తం పార్టీ చిత్తశుద్ధితో పనిచేయలేదన్నారు. అవినీతి నిర్మూలనకు అందరూ ముందుకు రావాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.