పుట్టినరోజు వేడుకలకు సచిన్ దూరం!
న్యూఢిల్లీ: భగవాన్ సత్యసాయి బాబా అనారోగ్యం పట్ల భారత క్రికెట్ స్టార్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కలత చెందాడు. బాబాకు భక్తుడయిన సచిన్ రేపు తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు. బాబా త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థన చేసినట్టు లిటిల్ మాస్టర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. బాబా ఆరోగ్యం కోసం భక్తులందరూ ప్రార్థనలు చేయాలని సచిన్ కోరాడు.