రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి పలు చోట్ల వర్షం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి పలు చోట్ల వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో భారీగా వాన పడింది. అకాలవర్షంతో వాహన చోదకులు ఇబ్బందులకు గురయ్యారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ముషీరాబాద్‌లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మలక్‌పేట, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. |