తెలంగాణ వీరుల కోసం శివాజి ‘కొలిమి’

తెలంగాణ వీరుల కోసం శివాజి ‘కొలిమి’


 శివాజి కథానాయకుడిగా ‘కొలిమి’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. నాగేంద్ర దర్శకత్వంలో ఉమాపార్వతి, లావణ్యారెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ- ‘‘తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం పట్టే సినిమా ఇది. రాష్ట్ర సాధన కోసం కృషి చేసే తెలంగాణ వీరుల పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోలు అతిథి పాత్రలు పోషిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అని తెలిపారు.

ఈ చిత్రానికి మాటలు: నియోగి, కెమెరా: ముజీర్‌మాలిక్, నిర్మాణం: చరిత్ర క్రియేషన్స్.