వచ్చే పార్లమెంటు సమావేశాల్లో లోక్‌పాల్‌ బిల్లు : ప్రణబ్‌

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో లోక్‌పాల్‌ బిల్లు : ప్రణబ్‌
 తిరువనంతపురం : వచ్చే పార్లమెంటు సమావేశాల్లో లోక్‌పాల్‌ బిల్లును ప్రవేశపెట్టేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి 
ప్రణబ్‌ముఖర్జీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సహకరిస్తే బిల్లు ఆమోదింపజేసేందుకు అభ్యతరం లేదన్నారు. 1998-2004 మధ్య అధికారంలోఉన్న 
ఎన్డీయే ప్రభుత్వం లోక్‌పాల్‌బిల్లు ఎందుకు ఆమోదింపజేయలేకపోయిందో తెలియాల్సి ఉందన్నారు. బిల్లు ఆమోదింపజేయడానికి అప్పటి 
హోంమంత్రి ఎల్‌కే అద్వానీకి అడ్డుపడిన అంశాలు ఏమిటో చెప్పాలన్నారు. కమిటీలో తండ్రీకొడుకులు శాంతిభూషణ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ పేర్లు 
ఉండడంపై ప్రణబ్‌ స్పందిస్తూ ఆ విషయం అన్నాహజారేకు సంబంధించిన అంశమని చెప్పారు.