‘బాబా రాందేవ్ ఆస్తులు వెల్లడించాలి’

‘బాబా రాందేవ్ ఆస్తులు వెల్లడించాలి’

 ఇండోర్: యోగా గురువు బాబా రాందేవ్ తన ఆస్తుల వివరాలు ప్రకటించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ట్రస్ట్ ఆస్తుల వివరాలు బహిర్గతం చేయాలన్నారు. పదేళ్ల క్రితం సైకిల్ టైరు పంక్చర్ వేయించుకోవడానికి డబ్బుల్లేని రాందేవ్ ఇప్పుడు రూ. 1,100 కోట్ల ఆస్తులు కలిగివున్నారని దిగ్విజయ్ చెప్పారు. నల్లధనంపై విచారణ చేపట్టాలని కోరుతున్న బాబా ముందుగా తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.