సచిన్‌కు భారతరత్న ఇవ్వాలి: సింధియా
గుణ: స్టార్ క్రికెటర్ మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కోరారు. భారతరత్నకు సచిన్ అన్నివిధాల అర్హుడని ఆయన అన్నారు. క్రీడ లకు సచిన్ చేసిన సేవలకు గుర్తింపుగా అత్యున్నత పురస్కారం ఇవ్వాల్సిందేనని అని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎమ్‌పీసీఏ) అధ్యక్షుడిగా కూడా ఉన్న సింధియా కోరారు.