అధికారులతో ప్రీతిజింటా వాగ్వాదం




 అధికారులతో ప్రీతిజింటా వాగ్వాదం


 
చంఢీఘర్: బాలీవుడ్ తార, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ భాగస్వామి ప్రీతిజింటాను చంఢిఘర్ ఎయిర్‌పోర్ట్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) అడ్డగించారు. ఐడీ కార్డును చూపించాలనికోరడంతో జింటాకు, సీఐఎస్‌ఎఫ్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఐడీ కార్డును చూపడానికి జింటా మొండికేసినట్టు సమాచారం. విషయం వివాదస్పదమౌతుందని గ్రహించిన అధికారులు కలుగచేసికొని పరిస్థితిని చక్కదిద్దారు. సెలబ్రిటిలకు, సాధారణ ప్రజలకు నియమాలు వేర్వేరుగా వుండవన్నారు. అయితే చివరకు ఐడీ కార్డును చూపించిన తర్వాతే విమానం ఎక్కెందుకు అనుమతించామని అధికారులు వెల్లడించారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులను జింటా తీవ్రమైన పదజాలంతో దూషించినట్టు సమాచారం.