2జీ స్కామ్‌లో పవార్: నీరారాడియా
న్యూఢిల్లీ: 2జీ కుంభకోణంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్‌కు పాత్ర వుందంటూ లాబీయిస్ట్ నీరారాడియా ఆరోపణలు రాజకీయవర్గాల్లో సంచలనం రేపాయి. వివాదస్పద డిబీ రియాల్టీ గ్రూప్ వ్యవహారాలు పవార్ నియంత్రణలో కొనసాగుతున్నాయని సీబీఐ విచారణలో రాడియా తెలిపినట్టు సమాచారం. ఈ కుంభకోణంలో ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన స్వాన్ కంపెని డీబీ రియాల్టీకి చెందినది. అయితే పవార్ పాత్రలో తన వద్ద ప్రత్యక్షంగా సాక్ష్యాలు లేవని ఆమె స్పష్టం చేశారు. రాడియా చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించడానికి నిరాకరించింది. 2జీ కుంభకోణంలో పవార్ పాత్రపై స్పందించడానికి సరియైన సమయం కాదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ దాటవేశారు. రాడియా ఆరోపణలను కేంద్ర మంత్రి పవార్ ఖండించారు. రాడియా ఆరోపణలన్ని అసత్యాలని ఆయన అన్నారు.