జగన్, విజయమ్మలకు భారీ మెజారిటీ ఖాయం

జగన్, విజయమ్మలకు భారీ మెజారిటీ ఖాయం

వైఎస్‌ఆర్ జిల్లా: ఎప్పుడు సర్వేల్లో ముందుండే విజయవాడ ఎంపీ రాజగోపాల్ ఈ సారి కూడా తన వంతు ప్రయత్నం చేశారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులుగా డీఎల్, వివేకాల పేర్లు ఖరారైన తరువాత లగడపాటి రాజగోపాల్ సర్వే చేయించారు. అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో యువనేత జగన్మోహనరెడ్డి, విజయమ్మలకు భారీ మెజారిటీతో గెలుస్తారని లగడపాటి సర్వే చెబుతున్న నిజం. కాంగ్రెస్ అభ్యర్ధులు ఓటమి ఖాయమవ్వడమే కాదు.. పార్టీ మూడో స్ధానానికే పరిమితమవుతోందని లగడపాటి సర్వేలో వెల్లడైనట్లు సమాచారం.