25 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు

25 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు

హైదరాబాద్: ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 25 నుంచి హాల్ టికెట్లు పొందవచ్చు. ఎంసెట్ తేదీని మే 8 నుంచి 22కు వాయిదా వేయడంతో హాల్ టికెట్ల పంపిణీ షెడ్యూల్‌ను సవరించామని కన్వీనర్ ఎన్.వి.రమణారావు తెలిపారు. అభ్యర్థులు అక్నాలెడ్జ్‌మెంట్ రశీదు చూపించి మే 2వ తేదీ వరకు సంబంధిత రీజినల్ కేంద్రాల నుంచి హాల్ టికెట్లు పొందవచ్చు.