నేడే పీఎస్‌ఎల్‌వీ సీ16 ప్రయోగం

నేడే పీఎస్‌ఎల్‌వీ సీ16 ప్రయోగం

సూళ్లూరుపేట (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు), న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్ వీ సీ16)ను బుధవారం ఉదయం 10.12 గంటలకు ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. వాహకనౌక ద్వారా రిసోర్స్‌శాట్-2, యూత్‌శాట్, ఎక్స్-శాట్‌లను అంతరిక్ష కక్ష్యలోకి చేర్చనున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ16 రాకెట్ ద్వారా 1,404 కిలోల బరువు కలిగిన మూడు ఉపగ్రహాలను భూమికి 822 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి పంపటానికి ప్రయోగపనులను ఇస్రో శాస్తవ్రేత్తలు చేస్తున్నారు. ప్రయోగం కోసం మొదలుపెట్టిన 54 గంటల కౌంట్‌డౌన్ దిగ్విజయంగా పూర్తవుతోందని ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు.