Telangana to DS

తెలంగాణ ఇవ్వాలని సోనియాకు డీఎస్ లేఖ

హైదరాబాద్ : చాలా రోజుల తరువాత మాజీ పీసీసీ ఛీఫ్ డి. శ్రీనివాస్ వార్తల్లోకి వచ్చారు. తెలంగాణ ఇవ్వాలని సోనియాకు లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్టగట్టాలంటే వెంటనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని సోనియాను కోరారు. ఉద్యమం తారాస్థాయికి చేరిందని, తెలంగాణ ఏర్పాటు తప్ప మరోమార్గం లేదని లేఖలో పేర్కొన్నారు.