పీఎస్‌ఎల్‌వీ-17 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ-17 ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం సాయంత్రం కమ్యూనికేసణ్ శాటిలైట్ -12ను పీఎస్‌ఎల్‌వీ-17 ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. విజయవంతంగా జీశాట్-12ను కక్ష్యలోకి ప్రవేశించడంతో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగితేలారు. 200 కోట రూపాయల వ్యయంతో పీఎస్‌ఎల్‌వీ-17ను రూపొందించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి శుక్రవారం సాయంత్రం 4.48 గంటలకు 1,410 కిలోల జీశాట్-12ను ప్రయోగించారు. పీఎస్‌ఎల్‌వీ-సీ17 ద్వారా జీశాట్12 ప్రయోగం విజయవంతమైనందుకు ఇస్రో చైర్మన్ కే.రాధకృష్ణన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రామీణ వ్యవస్థ సమాచారాన్ని జీశాట్ తెలియచేస్తుందని ఆయన తెలిపారు.






