కాంగ్రెస్‌లో ఉంటూ ప్రజల్లోకి తిరగలేని పరిస్థితి

కాంగ్రెస్‌లో ఉంటూ ప్రజల్లోకి తిరగలేని పరిస్థితి



న్యూఢిల్లీ : తెలంగాణ విషయంలో ఇక జాప్యం చేయవద్దని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కోరామని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు తెలిపారు. గురువారం సాయంత్రం ప్రధానితో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ సుమారు 45 నిమిషాలు పాటు కొనసాగింది. భేటీ అనంతరం కేకే మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఉంటూ ప్రజల్లోకి తిరగలేని పరిస్థితిని ప్రధానికి వివరించామన్నారు.

ఈ విషయంలో జాప్యం చేస్తే పదవులకు రాజీనామాలు చేస్తామని చెప్పామన్నారు. తమకు పదవుల కంటే తెలంగాణయే ముఖ్యమని స్పష్టం చేశామన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి చెప్పారని కేకే తెలిపారు. మీడియా కథనాల వల్ల అయిదుగురు మంత్రులు వెనక్కి వెళ్లటం బాధాకరమన్నారు.