నేడు జగన్ నామినేషన్

నేడు జగన్ నామినేషన్

కడప, న్యూస్‌లైన్ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కడప పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10.50 నుంచి 11.50 గంటల మధ్య కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి జగన్ తన నామినేషన్ పత్రాలను అందజేస్తారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి విజయలక్ష్మి శనివారం ఉదయం 11.30నుంచి 1.30 గంటల్లోపు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తమ నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. యువనేత జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రవుంలో పాల్గొనేందుకు రాష్టవ్య్రాప్తంగా అన్నిజిల్లాల నుంచి అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు తరలివస్తున్నారు. జగన్‌కు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు అనేక మంది నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం.