కొత్త సీఎం కేసీఆర్‌ ?

కొత్త సీఎం కేసీఆర్‌ ?
 
త్వరలో రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. ఆయన ఎవరో తెలుసా? ప్రస్తుత టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌! అవును ఆశ్చర్యం అనిపించినా ఇది నిజమనే ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీనం అయిన తర్వాత కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా రానున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు బల్లగుద్దిమరీ చెబుతున్నాయి. ఆ మేరకు కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ మధ్య విలీన ప్రక్రియ వ్యవహారం జోరందుకుంటోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్చార్జి, కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌ ఇద్దరూ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌తో ఆ మేరకు తరచూ మంతనాలు సాగిస్తు న్నట్లు ఢిల్లీ పార్టీల సమాచారం. చిరంజీవి పీఆర్పీని తనలో విలీనం చేసుకున్న కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పుడు టీఆర్‌ఎస్‌పై దృష్టి సారించింది.

జూన్‌లోగా టీఆర్‌ఎస్‌ విలీన ప్రక్రియ ప్రకటనను వెలువరిం చాలన్న లక్ష్యంతో ఆజాద్‌ శరవేగంగా పావులు కదుపుతున్నారు. చిరంజీవి పీఆర్పీని విలీనం చేసుకోవడం ద్వారా కోస్తాలో బలపడు తున్నట్లు భావిస్తోన్న కాంగ్రెస్‌ నాయకత్వం.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ విలీనం ద్వారా అక్కడ కూడా బలపడాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం సిద్ధమవు తోంది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణలో నెలకొన్న ఉద్యమ పరిస్థితిని చల్లార్చడంతో పాటు, ఉద్యమాల వల్ల నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించాలని నాయకత్వం యోచిస్తోంది. కేసీఆర్‌ స్థాయిలో తెలంగాణ ఉద్య మాన్ని ప్రభావితం చేసే నాయకులు లేకపోవడం, మిగిలిన ఉద్యమ సంస్థలు, నాయకులకు సైతం కేసీఆర్‌ నచ్చచెప్పి ఉద్యమాన్ని అటకెక్కించగలరన్న విశ్వాసంతో ఉంది.

bhaaanమొత్తంగా.. కేసీఆర్‌కు సీఎం పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందరగోళానికి తెర దించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ నాయకత్వం చురు కుగా వ్యవహరిస్తోంది. ఆ మేరకు గులాంనబీ ఆజా ద్‌, అహ్మద్‌ పటేల్‌ ఇద్దరూ కేసీఆర్‌తో తరచూ ఫోన్‌ లో సంప్రదింపులు జరుపుతున్నట్లు అటు కాం గ్రెస్‌- ఇటు టీఆర్‌ఎస్‌ వర్గాల్లోనూ ప్రచారం జరు గుతోంది. ముందు టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీ నం చేయాలని, ఆ తర్వాత షరతు ప్రకారం కేసీఆర్‌ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని, 2014 ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారిద్దరూ కేసీఆర్‌కు స్పష్టం చేసిన ట్లు పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగు తోంది. తాము సీమాంధ్ర ఎంపీలు, నాయకులను ఇప్పటినుంచే ఆ మేరకు సిద్ధం చేస్తున్నామని, తెలం గాణ కాంగ్రెస్‌ నాయకులను మానసికంగా సిద్ధంగా చేస్తున్నామని వారిద్దరూ కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం.

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలంతా విలీనా నికి అంగీకరించారని, సీమాంధ్ర వారిని కూడా ఒప్పించి తీరతామ ని వారిద్దరూ కేసీఆర్‌కు భరోసా ఇచ్చారు. మీరు కూడా ప్రజలు, పార్టీ నేతలను మానసికంగా ఇప్ప టినుంచే సన్నద్ధం చేయాలని సూచించారు. నిజానికి కేసీఆర్‌ తన పార్టీ నేతలు, శ్రేణులు, తనకు మద్దతుగా ఉన్న ఉద్యమ సంస్థల ను, కాంగ్రెస్‌లో విలీనా నికి అనుగుణంగా చివరకు ప్రజలను సైతం మానసి కంగా సిద్ధం చేస్తూనే ఉన్నా రు. కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత తెలంగాణలో మనదే హవా ఉంటుం దని, మనం చెప్పినట్లే కాంగ్రెస్‌ నడుస్తుందని ఆయన నేతలకు భరోసా ఇస్తున్నారు. నిండు సభలోనే కాం గ్రెస్‌లో విలీనంపై ప్రజలను అడిగే నిర్ణయం తీసు కుంటామని అన్నారే తప్ప, విలీనం చేసేది లేదని ఇం తవరకూ ఖండించ కపోవడం గమనార్హం.

కాంగ్రెస్‌లో విలీనంపై వరస కథనాలు మీడియాలో వస్తున్న ప్పటికీ కేసీఆర్‌ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఖండించకపోవడం బట్టి కేసీఆర్‌ కూడా విలీనానికి సిద్ధంగానే ఉన్నారన్నది స్పష్టమవు తోంది. తాజాగా ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్‌ నేత జి.విజ యరామారావు, కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే అరవిం దరెడ్డి తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీ నం చేసేందుకు సిద్ధం గా ఉన్నామని, తమకు తెలం గాణ కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టంగా ప్రకటిం చారు. అంతకు ముందు వివిధ స్థాయి నేతలు సైతం ఇదే ధోరణి ప్రదర్శించారు. అందుకే ఇటీవలి కాలం లో ఏ ఒక్క టీఆర్‌ఎస్‌ నేత కాంగ్రెస్‌ పార్టీపైగానీ, సోనియా గాంధీపైనా పల్లెత్తు మాట అనకపోవడం ప్రస్తావ నార్హం. అసలు కేసీఆర్‌ అయితే చాలాకాలం నుంచి చంద్రబాబునాయుడును తప్ప, సోనియాగాంధీని విమర్శించడమే మానుకున్నారు. మే వరకూ ఉద్య మానికి విశ్రాంతి ఇవ్వడం, జర్నలిస్టుల ఢిల్లీ ప్రదర్శ న వంటి వాయిదాల వెనుక కూడా ఇదే వ్యూహం ఉందంటున్నారు.

ఇదిలా ఉండగా తన పార్టీని కాం గ్రెస్‌లో విలీనం చేసే అంశంపై కేసీఆర్‌ మేధావులు, తెలంగాణ ఉద్యమ, ఉద్యోగ సంఘాల అభిప్రా యాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. తన వద్దకు వచ్చిన వివిధ సంఘాల నేతలతో కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల్లో బాహాటంగానే చర్చ జరు గుతోంది. ఇటీవల తెలంగాణ ఎంఎస్‌ఓల సమావే శంలో సైతం ఆయన ఆ మేరకు వారి అభిప్రాయా లు అడిగినట్లు వెల్లడయి, అక్కడి నుంచే ఆ అంశం పై చర్చ మొదలయిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం కేసీఆర్‌ను కలిసిన కొందరు తెలం గాణ జర్నలిస్టుల నేతల వద్ద కూడా ఈ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ఎలా ఉంటుందని ఆయన ఆరా తీశారు. విలీ నంపై ఆయన తన అక్షర కార్మికుల ద్వారా మిగిలిన వారిని సన్నద్ధం చేస్తున్నట్లు జర్నలిస్టు వర్గాల్లో ప్రచా రం జరుగుతోంది. ‘మనకు ముఖ్యమంత్రి కూడా ఇస్తామంటున్నారు. అది కాదు ముఖ్యం. తెలంగాణ ఇస్తామంటున్నార’ని కేసీఆర్‌ వారి వద్ద వ్యాఖ్యానిం చినట్లు చెబుతున్నారు.

దానికి ఇద్దరు మినహా, మిగి లిన జర్నలిస్టులంతా విలీనం చేయడమే మంచిదని సలహా ఇచ్చారు. వారిలో ఎక్కువమంది వచ్చే ఎన్ని కల్లో కేసీఆర్‌ ప్రాపకంతో పోటీ చేద్దామనే ఉత్సా హవంతు లని తెలుస్తోంది. గతంలో టికెట్ల కోసం ప్రయత్నించిన కొందరు జర్నలిస్టులు ఇప్పుడు కొత్త మార్గం పట్టినట్లు చెబుతున్నారు. అందులో ఇద్దరు మాత్రం విలీనం వద్దని, కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ప్రతిపక్షం ఉండాలి కదా అని ప్రశ్నించినట్లు తెలి సింది. ఇక మనం విలీనం అయిన తర్వాత ఇక్కడ ప్రతిపక్షమనేదే ఉండదని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు జర్నలిస్టు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, జూన్‌ నెలా ఖరులో కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీన ప్రక్రియ వ్యవహారంపై బహిరంగ ప్రకటన వెలువడవచ్చని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆలోగా తెలం గాణలో టీడీపీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలని ఆజాద్‌ తన సంభాషణలో కేసీ ఆర్‌కు సూచించినట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి. ఇప్పటికే కొందరు అగ్రనేతలతో తాను టచ్‌లోనే ఉన్నానని, వారు తనతో పాటు వచ్చేందుకు సిద్ధం గానే ఉన్నారని కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం.

టీడీపీని బలహీనపరి చేందుకే తాను వివిధ ఉద్య మ సంస్థల వేదికలను ఏర్పాటుచేసి, వారి ద్వారా టీడీపీ నేతలను వేదికపై చేర్చి వారిని మానసికంగా టీడీపీకి, చంద్రబాబునాయుడుకు దూరం చేసే ఎత్తుగడను అమలు చేస్తున్న వైనాన్ని ఆజాద్‌కు వివ రించినట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోం ది. అందుకు తగినట్లు గానే టీడీపీ భూస్థాపితం అయితేనే తెలంగాణ వస్తుం దంటూ కేసీఆర్‌ తాజా గా ప్రకటించడం చూస్తే కేసీఆర్‌ అజెండా ఏమిట న్నది స్పష్టమవుతూనే ఉంది. నిజానికి కేసీఆర్‌ తన కు అనుకూల తెలంగాణ సంస్థల ద్వారా టీడీపీ సీని యర్లను వేదికపైకి తీసుకువచ్చి, వాటి ద్వారా తన వైపు మళ్లించుకునే వ్యూహం కొనసాగిస్తున్నారు.

ఆ విషయం తెలియని టీడీపీ సీనియర్లు కేసీఆర్‌ ఉచ్చు లో సులభంగానే చిక్కుకుపోతున్నారు. జాక్‌కు దూరంగా ఉంటున్న టీడీపీ నేత లు కొత్తగా టీజేఎఫ్‌ ఏర్పాటుచేస్తున్న వేదికలకు హాజరవుతున్న విష యం తెలిసిందే. కాగా, ఈనెలలో 27న హైదరా బాద్‌లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినో త్సవాన్ని కాంగ్రెస్‌ నాయకత్వానికి బల ప్రదర్శనగా చూపేందుకు కేసీఆర్‌ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోం ది. దాదాపు 10 లక్షల మందికి పైగా జనాలను తర లించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాం గ్రెస్‌తో విలీనానికి సిద్ధమవుతున్న క్రమంలో తన బలమేమిటో ఆ పార్టీ నాయకత్వానికి చూపాలన్నది కేసీఆర్‌ లక్ష్యమంటున్నారు.