శ్రీకృష్ణ కమిటీపై కేసు
చాప్టర్ 8లో వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కోర్టు
హైదరాబాద్, న్యూస్‌లైన్: శ్రీకృష్ణ కమిటీ చాప్టర్ 8లో తెలంగాణ ప్రజలను కించపర్చిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు స్పందించింది. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా శ్రీకృష్ణ కమిటీకి నేతృత్వం వహించిన జస్టిస్ శ్రీకృష్ణతోపాటు సభ్యులపై కేసు (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసి దర్యాప్తు చేయాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే మతవిద్వేషాలు పెరుగుతాయని పేర్కొంటూ శ్రీకృష్ణ కమిటీ చాప్టర్ 8లో పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ వలి ఉర్ రెహమాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను పద్నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుధాకర్ శుక్రవారం విచారించారు. శ్రీకృష్ణ కమిటీకి అధికారాలు లేకపోయినా అనేక వివాదాస్పద సిఫార్సులు చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది సయ్యద్ లతీఫ్ వాదనలు వినిపించారు. వీరిచ్చిన సిఫార్సులతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ మేరకు శ్రీకృష్ణ కమిటీ చాప్టర్ 8లో పేర్కొన్న అంశాలను ప్రచురించిన ఓ దినపత్రిక ప్రతిని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. జస్టిస్ శ్రీకృష్ణతోపాటు సభ్యులు వినోద్ దుగ్గల్, అబూసలే షరీఫ్, రవీందర్‌కౌర్, ప్రొఫెసర్ రణబీర్‌సింగ్‌లపై భారతీయ శిక్షా స్మృతిలోని 153(ఎ) (రెండు వర్గాల మధ్య సామరస్య వాతావరణాన్ని భగ్నం చేయడం), 418 (నమ్మకద్రోహం), 504 (ఉద్దేశపూర్వకంగా శాంతిని భగ్నం చేయడం), 505(2)(రెండు వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం పెంచడం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి... ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా ప్రతివాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించారు.
షరీఫ్, కౌర్‌లపై ఇప్పటికే కేసు
తెలంగాణ ముస్లిం, మైనారిటీలు రాష్ట్ర విభజనను కోరుకోవడం లేదంటూ గతంలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు అబూసలేషరీఫ్, రవీందర్‌కౌర్‌లు చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై.. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు అబిడ్స్ పోలీసులు జనవరి మొదటి వారంలో కేసు నమోదు చేశారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యుల వ్యాఖ్యలు ముస్లిం మనోభావాలను కించపర్చాయని ఆరోపిస్తూ మహ్మద్ వలివుర్ రెహ్మాన్ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును విచారించిన అనంతరం కోర్టు ఈ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై సియాసత్ దినపత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చూపారు. సియాసత్ కార్యాలయం ఉన్న అబిడ్స్ పోలీసులను ఈ మేరకు విచారణ జరపాలని కోరారు. ఐపీసీలోని 153(ఎ), 418, 504 , 505(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసు నమోదు చేసి నాలుగు నెలలు గడచినా ఇప్పటికీ దర్యాప్తులో పురోగతి లేదు.