వైఎస్ ఫోటో లేకుండా పోటీ చేసే దమ్ముందా: సురేఖ
వచ్చే నెలలో జరిగే కడప, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఫోటో లేకుండా పోటీ చేసే దమ్ముందా అంటూ యువనేత జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ సవాల్ విసిరారు.
ఆమె కర్నూల్‌లో మాట్లాడుతూ వైఎస్ఆర్ ఫొటో ప్రచారానికి వాడుకోకుండా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అభ్యర్థులకు ఆమె పిలుపునిచ్చారు. దివంగత వైఎస్ ఫొటో వాడుకునే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు.
విజయం కోసం కాంగ్రెస్ వేసే ప్రతి అడుగునూ ప్రజలు గమనిస్తున్నారని ఆమె హెచ్చరించారు. కడపలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లభించక ఎవరిని పోటీలో నిలపాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతోందని సురేఖ అన్నారు. జగన్‌పై పోటీ చేయడానికి నేతలు భయపడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
ప్రధానంగా కడప లోక్‌సభకు పోటీ చేసే మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వైఎస్ఆర్ పోటో లేకుండా బరిలోకిదిగి గెలుపొందాలన్నారు. అలా చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.