పేసర్ లసిత్ మలింగ టెస్టులకు గుడ్‌బై

పేసర్ లసిత్ మలింగ టెస్టులకు గుడ్‌బై
 




న్యూఢిల్లీ: ఐపీఎల్‌ను వీడి వెంటనే స్వదేశానికి రావాలని ఆదేశించిన శ్రీలంక క్రికెట్ బోర్డు సెలక్టర్లకు పేసర్ లసిత్ మలింగ షాక్ ఇచ్చాడు. వారి హుకుంను బేఖాతరు చేస్తూ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వన్డే, ట్వంటీ-20 క్రికెట్ ఫార్మాట్‌లపై మరింత దృష్టి పెట్టేందుకే రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నానని మలింగ తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న 27 ఏళ్ల మలింగను ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం శ్రీలంక జట్టులోకి ఎంపిక చేయలేదు. మోకాలి గాయంతో బాధపడుతున్నానని, టెస్టు జట్టు ఎంపికలో తనను పరిగణనలోకి తీసుకోవద్దని ఇటీవల ఈ పేసర్ సెలక్టర్లను కోరాడు. అయితే గాయంతో ఐపీఎల్‌లో ఎలా ఆడుతున్నావని ప్రశ్నిస్తూ లంక సెలక్టర్లు మలింగను వెంటనే స్వదేశానికి రావాలని ఆదేశించారు. కానీ మలింగ వారి మాటలను పట్టించుకోలేదు.

టెస్టు కెరీర్
ఆడిన టెస్టులు : 30
తీసిన వికెట్లు : 101
సగటు : 33.15
ఉత్తమ బౌలింగ్ : 5/50