కాంగ్రెస్‌లోకి మరికొంతమంది జగన్ ఎమ్మెల్యేలు: డీఎల్
కాంగ్రెస్ పార్టీలోకి మరికొంతమంది జగన్ వర్గ ఎమ్మెల్యేలు వస్తారని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి డీఎల్.రవీంద్రా రెడ్డి జోస్యం చెప్పారు. కడప జిల్లా బద్వేల్ శాసనసభ్యురాలు కమలమ్మ మంగళవారం డీఎల్‌తో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో పని చేయనున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.
దీనిపై మంత్రి, కడప కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి డీఎల్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొంత మంది తిరిగి సొంత పార్టీకి రానున్నట్టు చెప్పారు. జగన్ వర్గంలో దళితులకు గౌరవం లేదని, కమలమ్మకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్చను వైఎస్ జగన్ కల్పించలేదని ఆయన ఆరోపించారు.
కమలమ్మ బుధవారం నుంచి కడప, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని చెప్పారు. ఈమె ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లో కలిశారన్నారు.