తెలుగు మహిళలో... వసూల్‌ రాణులు ?

తెలుగు మహిళలో... వసూల్‌ రాణులు ?

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలుగుమహిళలో చందాల లొల్లి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తలనొప్పిలా పరిణమించింది. కార్యక్రమాల పేరిట పార్టీ నేతల వద్ద చందాలు వసూలు చేస్తూ లెక్కలు చెప్పని వైనంపై మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తూ, పెత్తన మంతా ఒక్కరికే అప్పగించడం, సదరు నేత తమపై జులుం చేయడాన్ని సీనియర్‌ మహిళా నేతలు సహించలేకపోతున్నారు. కార్యక్రమాలు, వాటి రూపకల్పన, కార్యకర్తల సమీకరణ అంశాల్లో శోభా హైమావతి స్వయంగా శ్రద్ధ చూపించకుండా ఒక నాయకురాలిపై ఆధారపడుతుండటంపై సీనియర్‌ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు నేత కార్యక్రమాల పేరుతో చందాలు వసూలు చేస్తున్న వైనం ఒక్కొక్కటి వెలుగులోకి రావటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సనత్‌నగర్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేత నుంచి 50 వేల రూపాయలు తీసుకున్నారని, ఆ డబ్బు కోసం ఫోన్‌ చేస్తున్నా సదరు మహిళా నేత స్పందించడం లేదంటున్నారు.

అదేవిధంగా, వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నేతల వద్ద కూడా కార్యక్రమాల పేరిట చందాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఇవన్నీ శోభా హైమావతికి తెలిసి జరుగుతు న్నాయా? తెలియకుండా జరుగుతున్నాయో అర్ధం కావడం లేదంటున్నారు. నిరంతరం అధ్యక్షురా లితోనే ఉండటం, అన్ని బాధ్యతలూ ఆమెకే అప్ప గించడం వల్ల ఆమెకు తెలిసే జరుగుతున్నాయని భావించవలసి వస్తోందంటున్నారు. గతంలో తెలుగుమహిళ అధ్యక్షురాలిగా పనిచేసిన నన్నప నేని రాజకుమారి, రోజా హయాంలోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత వారిద్దరూ ఆమెను దూరంగా ఉంచారంటున్నారు.

కార్యక్రమాల సందర్భంలో కూడా స్థానిక నేతలను వెనక్కి నెట్టి తానే ముందుకూ ర్చుంటూ తమను అవమానిస్తున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఈ విషయం లో అధ్యక్షురాలు కూడా ఆమెనే ప్రోత్సహి స్తుండంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలకు వెళ్లిన సందర్భాల్లో సదరు నేత జిల్లా మహిళా నేతల వద్ద చీరలు పెట్టించుకుంటున్నారని, పార్టీ కార్యాల యంలో ఒక నాయకుడి అండతోనే ఇలా జరుగు తోందంటున్నారు.

కార్యక్రమాలకు కార్యకర్తలను తీసుకువచ్చిన సందర్భాల్లో అధ్యక్షురాలిని కలు స్తున్న రాష్ట్ర నేతలను... సమీకరణ విషయాలు తనకు సన్నిహితంగా వ్యవహరిస్తోన్న నేతకు చెబితే సరిపోతుందని, తనకు చెప్పవలసిన పనిలేదంటు న్నారని మహిళా నేతలు చెబుతున్నారు. అధ్యక్షు రాలు పూర్తిగా ఆమెపైనే ఆధారపడుతుంటే పనిచేసే వారి వివరాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. దీనితో పార్టీ కార్యక్రమాలకు వెళ్లేందుకు ఆసక్తి పోతోందని వివరిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని కొందరు మహిళా నేతలు అంటున్నారు.