యుఏఇలోని అబుదాబిలో దాసరికి సన్మానం

యుఏఇలోని అబుదాబిలో దాసరికి సన్మానం

యుఏఇలోని అబుదాబికి చెందిన తెలుగు కళా స్రవంతి సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది వేడుకల్లో సీనియర్ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావును ఘనంగా సన్మానించనున్నారు. ఈ నెల 29న అబుదాబిలో జరగనున్న ఈ వేడుకలో సుమన్, ఏవీఎస్, బాబూమోహన్, హేమ, సురేఖావాణి, తిరుపతి ప్రకాష్. గాయకుడు గంగాధర్‌తో పాటు పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొంటారని తెలుగు కళా స్రవంతి సంస్థ టూర్ కన్వీనర్ మరియు జర్నలిస్టు ప్రభు తెలియజేశారు. ఈ వేడుకలో దాసరి నారాయణరావుతో పాటు దుబాయ్‌లోని ప్రముఖ వ్యాపార వేత్త అయిన ప్రవాసాంధ్రుడు కె.ఉదయనంద రెడ్డిని కూడా సన్మానిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు చెరుకూరి పృథ్వీరాజ్ చెప్పారు. ప్రతిభావంతులను గుర్తించి సన్మానాలు చేసే దాసరి నారాయణరావు... తనకు చేసే సన్మానాన్ని అంగీకరించడం ఇంతవరకు చూడలేదని, ఈ పండుగను చూడటానికి కమెడియన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా అబుదాబి వెళుతున్నామని ఏవీఎస్ పేర్కొన్నారు.