బాబాకు అవయవాల దానానికి సిద్ధపడిన భక్తుడు
పుట్టపర్తి: సత్యసాయి బాబాకు తన అవయవాలు దానం చేయడానికి గణపతి రాజు అనే భక్తుడు ముందుకు వచ్చాడు. ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని గణపతి రాజు ఆస్పత్రి డైరెక్టర్ సఫాయాకు అందజేస్తారు. బాబా కోలుకొని బయటకు రావాలన్నదే తన కోరిక అని అందుకు తన శరీరంలోని అవయవాలన్నీ దానం చేస్తానని ఆయన చెప్పారు. బాబా కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.