‘‘ఆత్మహత్యల నేపథ్యంలో అల్లుకున్న కథ ‘నేను నా రాక్షసి’
‘‘ఆత్మహత్యల నేపథ్యంలో అల్లుకున్న కథ ‘నేను నా రాక్షసి’. తాత్కాలిక సమస్యలకు చావు శాశ్వత పరిష్కారం కాదనే విషయాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి చెబుతున్నాం. ఓ కిల్లర్‌కి, ఓ రాక్షసి లాంటి అమ్మాయికి మధ్య ఏం జరిగిందో తెరమీద చూడాల్సిందే. రొటీన్ చిత్రాలకు భిన్నమైన కథాంశంతో రూపొందిన లవ్‌థ్రిల్లర్ ఇది. నాకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్‌తో తెరకెక్కిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ చిత్రమిది’’ అంటున్నారు పూరి జగన్నాథ్.
రానా, ఇలియానా జంటగా ఆయన నిర్దేశకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రస్తుతం డీటీఎస్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ రానా, ఇలియానా కాంబినేషన్‌లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో రూపొందిస్తున్న చిత్రమిది. ఈ వేసవికి ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించే కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది’’ అన్నారు.
అభిమన్యు సింగ్, సుబ్బరాజు, అలీ, ముమైత్‌ఖాన్, ముక్తార్ ఖాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: విశ్వ-రెహమాన్, ఫొటోగ్రఫీ: అమోల్ రాథోడ్, సమర్పణ: బేబి భవ్య.