తమిళనాట 75.21 శాతం పోలింగ్
తమిళనాట 75.21 శాతం పోలింగ్

చెన్నై, మేజర్‌న్యూస్ : రాష్ట్ర శాసనసభకు బు‘దవారం జరిగిన 14వ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల సంఘం, పోలీసు అ‘దికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో 69 శాతం పోలింగ్ నమోదయ్యింది. బు‘దవారం ఉదయం 08.00 గంటల నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ‘ారులు తీరారు. 10.00 గంటల సమయానికి 12, 02.00 గంటలకు 44 శాతం, 04.00 గంటలకు 58 శాతం ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలకు గాను 54,314 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 66,799 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించారు.
కన్యాకుమారి, ‘దర్మపురి, రాజపాళ్యం, పెరంబూర్ తదితర ప్రాంతాల్లో ఉదయాన్నే ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. దీంతో అ‘దికారులు వాటి స్థానే వేరే యంత్రాలను ఉంచి పోలింగ్‌ను కొనసాగించారు. ఈ కేంద్రాలలో అర్ధగంట నుండి 45 నిమిషాలపాటు పోలింగ్ జరుగకపోవడంతో అదనపు సమయాన్ని కేటాయించారు. రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద వద్ధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో ‘ారులు తీరారు. 10 గంటలకే వాతావరణం వేడెక్కడంతో కొంతమేర జనం పలుచబడ్డారు. చెనై్న స్టెల్లా మేరీస్ కళాశాలలో అన్నాడిఎంకె అ‘దినేత్రి జయలలిత, సూపర్‌స్టార్ రజనీకాంత్, నటుడు కార్తీక్‌లతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోపాలపురంలోని శారదా విద్యాలయం మెట్రిక్యులేషన్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి ఎం. కరుణాని‘ది ఆయన భార్య దయాళు అమ్మాళ్‌తో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అదేవి‘దంగా ఉప ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, ఆయన భార్య దుర్గా స్టాలిన్‌లు తమ ఓట్లను వేశారు. కేంద్ర మంత్రి అళగిరి మదురైలో కుటుంబ సమేతంగా తమ ఓట్లను వేశారు. కారైకుడి నియోజకవర్గంలో కేంద్ర మంత్రులు పి.చిదంబరం, చెనై్న ఆళ్వారుపేటలో జి.కె.వాసన్‌లు తమ తమ ఓట్లను పోలింగ్ కేంద్రాలకు వచ్చి వేసి వెళ్లారు. ఎన్నికలను బహిష్కరించిన ఎండిఎంకె నేత వైగో కళింగపట్నంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాలిగ్రామంలోని పోలింగ్ కేంద్రంలో డిఎండికె అ‘ద్య‘ుడు విజయకాంత్, ఆయన భార్య ప్రేమలతతో వచ్చి తమ ఓట్లను వేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అ‘ద్య‘ుడు కె.వి.తంగ‘ాలు అడయార్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటును వేశారు.
తేనాంపేట పోలింగ్ కేంద్రంలో పద్మశ్రీ కమలహాసన్, టి.నగర్‌లోని హిందీ ప్రచార సభలో ఉన్న పోలింగ్ కేంద్రంలో నటుడు సూర్య, కార్తీక్‌లు తమ తమ ఓట్లను వేశారు. పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు విస్తత బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోనే ఓటర్లు మినహా ఎవరినీ అనుమతించలేదు. 200 మీటర్లకు బయటనే గుమికూడిన వివి‘ద రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలను కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ దళాలు ఆ ప్రాంతంనుండి వెళ్లగొట్టాయి. ఈ ఎన్నికల ఫలితాల లెక్కింపు మే 13న జరుగనుంది.