జగన్ వర్గం కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టబోతోందా..?!
కడప, పులివెందుల ఉపఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉంటున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ, కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆది నారాయణ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులపై జగన్ వర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తమను రెచ్చగొడుతోందని మండిపడ్డారు. కేవలం నలుగురకు మాత్రమే షోకాజ్ నోటీసులు ఇచ్చి మిగిలిన వారిని భయపెట్టాలని చూస్తోందన్నారు. అయితే వారి ఆటలు సాగవని బాలినేని ధీమా వ్యక్తం చేశారు.
ఉపఎన్నికల ముగిసిన తర్వాత తమ వర్గం ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పిస్తామని కాంగ్రెస్ పార్టీకి ఎటాక్ ఇచ్చారు. మరోవైపు కొండా సురేఖ సైతం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పీసీసీ చీఫ్ డీఎస్‌పై నిప్పులు చెరిగారు. ఏదో ఒక మిరకల్ జరిగి ఆగస్టులోపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో ఖచ్చితంగా మధ్యంతర ఎన్నికలు వస్తాయనీ, ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయ ఢంకా మోగిస్తారనీ, ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తారని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి పులివెందుల, కడప బలం చూసిన పిదప జగన్ వర్గం మరింత పగడ్బందీగా వ్యవహరించాలని ప్రణాళికలు రచిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని కూలదోయడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఎటువంటి ఎటాక్ ఇస్తారో వేచి చూడాలి.